Tuesday, March 10, 2009

బహిరంగ చర్చా సదస్సు

ద్రావిడ విశ్వ విద్యాలయంలోని స్కూల్ ఆఫ్ హ్యూమన్ అండ్ సోషల్ సైన్సెస్, ఇంకా స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ వారు కలిసి ఒక బహిరంగ చర్చా సదస్సు నిర్వహించారు. దీని శీర్షిక కమ్ముకున్న గ్లోబలీకరణ- కష్టాల్లో ద్రావిడ భాషలు. దీనికి చాలా మంచి ప్రతిస్పందన వచ్చింది. దీన్ని స్వయంగా విశ్విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రారంభించారు. మంచి ప్రశ్నలు సంధించారు. తర్వాత విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులు పరిశోధకులు పాల్గొన్నారు. ఇంగ్లీషు వ్యాప్తి విపరీతం కావడం బోధన మాధ్యమం ఇంగ్లీషు బాగా పాతుకుపోవడం వల్ల తెలుగు బోధన మాధ్యమం దాదాపు చివరి దశకు వచ్చిందని చాలా మంది బాధను వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి తెలుగుబోధన మాధ్యమాన్ని తిరిగి క్రమంగా బలవత్తరం చేసివ్యాప్తి చేయాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
ఈ బహిరంగ చర్చను ఆచార్య పులికొండ సుబ్బాచారి, ఆచార్య రాజేంద్రప్రసాద్ నిర్వహించారు.
పులికొండ సుబ్బాచారి