Tuesday, March 28, 2017

శిఖామణికి అభినందనలు



నేను బాగా నచ్చే మెచ్చే కొద్ది మంది వచనకవులలో శిఖామణి ముందువరుసలోనే ఉన్నారు. తన అనుభూతిని నూటికి నూరుపాళ్లు సిగ్నల్ లాస్ లేకుండా పాఠకుడికి అందించడంలో శిఖామణి చాలా ప్రతిభావంతుడు. శిఖామణి కవితానిర్మాణంలో చాలా సింప్లిసిటీని పాటిస్తాడు. వాక్య రచన గానీ పాదాల కూర్పు కానీ చాలా సింపుల్ గా ఉంటుంది. నిర్మాణంలో ప్రౌఢిని చూపించాలని ఎక్కడా తాపత్రయపడడు. ఇంత సింప్లిసిటీని కొందరు అాపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాని నాటి మువ్వల చేతికర్రదగ్గరనుండీ నిన్నమొన్నటి కవితదాకా శిఖామణి తన సింప్...లిసిటీని వీడలేదు. ఒక చెమ్మ ఎప్పుడూ గుండెకు తగిలించే గుణం ఈయన కవితనిండా ఉంటుంది. శతాబ్దాలుగా సుప్రసిద్ధమైన అలంకారాలని చాలా కొత్తగా చెప్పడం ఈయనకు బాగా వచ్చు. శిఖామణికి ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. శిఖామణిని దళిత కవి అని ఆయన పరిధిని తగ్గించడం నాకు నిజంగా ఇష్టం ఉండదు. చాలా విస్తృత ప్రపంచాన్ని సృష్టించాడు. వచన కవితారచన నిర్మాణంలో మంచి బిగింపును ప్రౌఢిని విచిత్రమైన వాక్య నిర్మాణాలూ (శిల్పం అనే మాట విచక్షణారహితంగా వాడి పనికి రాకుండా పోయిన పారిభాషిక పదాలలో ఒకటి దాన్ని వాడడంనాకు అంతగా నచ్చదు.) చేసే వారున్నారు. అదొక గొప్పకళ కాదనను. కాని ఈ సింప్లిసిటీతో ఆకట్టుకోవడం చాలా కష్టం. అనుభూతిని ట్రాన్స్ఫర్ చేసే శిఖామణి నైపుణ్యం నాకు బాగా నచ్చుతుంది. ఆయనకు ఈ సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాను.

No comments: